Friday, November 22, 2024

ఆక్సిజన్ సరఫరాపై దృష్టి పెట్టాలన్న ప్రధాని

అధిక పాజిటివిటీ రేట్ ఉన్న ప్రాంతాల్లో టెస్టులను మరింత పెంచాలని ప్రధాని నరేంద్రమోదీ అధికారులను ఆదేశించారు. దేశంలో కరోనా తాజా పరిస్థితి, టీకా డ్రైవ్‌ ప్రధాని నరేంద్ర మోదీ సమీక్ష నిర్వహించారు. అధికారులతో వర్చువల్‌ విధానంలో చర్చలు జరిపారు. రాష్ట్ర, జిల్లాస్థాయిలో కరోనా పరిస్థితి, టెస్టులు, ఆక్సిజన్ లభ్యత, ఆరోగ్య సంరక్షణ, మౌలిక సదుపాయాలు, టీకా రోడ్‌ మ్యాప్ పై ప్రధానికి అధికారులు వివరించారు. మార్చి ప్రారంభంలో వారానికి 50 లక్షల టెస్టుల నిర్వహించగా..ప్రస్తుతం వారానికి 1.3 కోట్ల టెస్టుల వరకు పెరిగాయని ప్రధానికి తెలిపారు. క్రమంగా పాజిటివిటీ రేటు తగ్గుతోందని, రికవరీ రేటు పెరుగుతోందని అధికారులు మోదీకి వివరించారు.

ఈ సందర్భంగా ఇంటింటికీ పరీక్షలు, నిఘాపై దృష్టి పెట్టడానికి గ్రామీణప్రాంతాల్లో ఆరోగ్యసంరక్షణ వనరులను పెంచాలని  ప్రధాని మోదీ సూచించారు. గ్రామీణప్రాంతాల్లో ఆక్సిజన్ సరఫరాపై దృష్టిసారించాలని ఆదేశించారు. వెంటిలేటర్లు,ఇతర పరికరాల ఉపయోగించడంలో ఆరోగ్య కార్యకర్తలకు అవసరమైన శిక్షణ ఇవ్వాలని తెలిపారు. వాక్సినేషన్లో మరింత వేగం పెంచేందుకు రాష్ట్రాలతో సమన్వయం చేసుకోవాలని ప్రధాని మోదీ ఆదేశించారు.

ఇదిలా ఉండగా.. గ‌త 24 గంట‌ల్లో కొత్తగా 3,26,098 కేసులు న‌మోద‌య్యాయి. మ‌రో 3,890 మంది మృతిచెందారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 2,43,72,907కు చేరింది. ఇందులో 2,04,32,898 మంది బాధితులు కోలుకోగా, 36,73,802 కేసులు యాక్టివ్‌ కేసులున్నాయని, వైరస్‌ బారినపడి మొత్తం 2,66,207 ప్రాణాలు కోల్పోయారని ఆరోగ్యశాఖ తెలిపింది.

ఇది కూడా చదవండి: తెలంగాణను హడలెత్తిస్తున్న బ్లాక్ ఫంగస్!

Advertisement

తాజా వార్తలు

Advertisement