Wednesday, November 20, 2024

క‌రోనా నియంత్రణకు సీఎంల‌తో మోదీ కీల‌క భేటీ..

క‌రోనా తీవ్రత అధికంగా ఉన్న‌ 10 రాష్ట్రాల సీఎం లతో ప్రధాని మోడీ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. క‌రోనా ఉద్ధృతి, తీసుకుంటోన్న చ‌ర్య‌ల‌పై చ‌ర్చించేందుకు ముఖ్య‌మంత్రుల‌తో ప్ర‌ధాన మంత్రి నరేంద్ర మోదీ వ‌ర్చువ‌ల్ విధానంలో స‌మావేశ‌మ‌య్యారు. ఆయా రాష్ట్రాల్లో తీసుకుంటోన్న చ‌ర్య‌లు, ఆసుప‌త్రుల్లో రోగులకు ఎదుర‌వుతున్న ఇబ్బందులు, ఆక్సిజ‌న్ కొర‌త వంటి అంశాల‌పై మోదీ చ‌ర్చిస్తున్నారు. కాగా త‌మ రాష్ట్రాల్లో ఉన్న స‌మ‌స్య‌ల గురించి ఆయ‌న‌కు సీఎంలు వివ‌రిస్తున్నారు. ఢిల్లీలో ఆక్సిజ‌న్ కొర‌త తీవ్రంగా ఉంద‌ని అర‌వింద్ కేజ్రీవాల్ చెప్పారు. ఢిల్లీలో ఆక్సిజ‌న్ ఉత్ప‌త్తి ప్లాంట్ లేద‌ని, ఢిల్లీకి స‌ర‌ఫ‌రా అవుతోన్న‌ ఆక్సిజ‌న్ ను ఇత‌ర రాష్ట్ర (హ‌ర్యానా) ప్ర‌భుత్వం అడ్డుకుంటుంటే తాము కేంద్ర ప్ర‌భుత్వంలో ఎవ‌రితో ఈ విష‌యంపై మాట్లాడాలో చెప్పాల‌ని మోదీని కేజ్రీవాల్ అడిగారు. దీంతో కాసేప‌ట్లో మోదీ దేశంలోని ప్ర‌ముఖ ఆక్సిజ‌న్ త‌యారీ సంస్థ‌ల ప్ర‌తినిధుల‌తోనూ స‌మావేశంలో పాల్గొననున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement