Friday, November 8, 2024

ఫార్మా కంపెనీలతో ప్రధాని మోదీ మీటింగ్.. కీలక నిర్ణయం తీసుకునే ఛాన్స్!

దేశంలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. రోజువారి కేసుల సంఖ్య మూడు లక్షలకు చేరుకుంటోంది. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ కీలక సమావేశం నిర్వహించనున్నారు. దేశంలోని వ్యాక్సిన్ తయారీదారులతో మోదీ భేటీ కానున్నారు. సాయంత్రం 6 గంటలకు ఫార్మా కంపెనీలతో ప్రధాని మోదీ వర్చువల్ మీటింగ్. ఇందులో మందుల తయారీ, రెమ్‌డెసివిర్ మందు కొరత, ఉత్పత్తి, ఆక్సిజన్ సరఫరా, వ్యాక్సిన్ల ఉత్పత్తి, విదేశీ వ్యాక్సిన్లు ఇలా ఎన్నో అంశాలపై చర్చించబోతున్నారు.

దేశంలో ఇప్పటివరకు అత్యవసర వినియోగానికి మూడు టీకాలు అనుమతి పొందాయి. ఇప్పటికే కావాగ్జీన్, కొవిషీల్డ్ టీకాలను వేస్తున్నారు. స్పుత్నిక్-వి వ్యాక్సిన్ కూడా అందుబాటులోకి రానుంది. మరో రెండు లేదా మూడు కంపెనీలకు చెందిన టీకాలను అనుమతిపై చర్చించే అవకాశం ఉంది.  ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ భేటీకి ప్రాధాన్యత ఏర్పాడింది. కాగా, ఈ ఫార్మా కంపెనీల సమావేశం నిన్నే జరగాల్సి ఉన్నా… ఇవాళ్టికి వాయిదా పడింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement