ఉక్రెయిన్- రష్యా మధ్య యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో దేశ భద్రతపై ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్‌తో పాటు పలువురు సీనియర్ అధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు. రష్యా- ఉక్రెయిన్ మధ్య యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో దేశ భద్రత, ప్రపంచ పరిణామాలపై ఈ సమావేశం లోతుగా చర్చించారు. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్‌కు చెందిన ముగ్గురు చీఫ్‌లు కూడా ఈ సమావేశంలో ఉన్నారు.
కాగా, రష్యా, ఉక్రెయిన్.. రెండు దేశాలతోనూ భారత్‌కు అవసరాలున్నాయని ప్రధాని మోదీ ఇటీవల వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. రాజకీయంగా, ఆర్థికంగా, భద్రతాపరంగా, విద్యా పరంగా భారత్ ఈ రెండు దేశాలతోనూ సంబంధాలను కలిగి వుందని చెప్పారు. అయితే భారత్ మాత్రం శాంతినే కోరుకుంటుందని, శాంతివైపే మొగ్గు చూపుతుందని స్పష్టం చేశారు. చర్చల ద్వారా అన్ని సమస్యలు పరిష్కరం అవుతాయని ఆశిస్తున్నట్లు చెప్పారు.