ప్రపంచంలోనే అత్యంత ప్రాజదరణ పొందిన నాయకుడిగా ప్రధాని నరేంద్ర మోడీ ఉన్నారని అమెరికా సర్వే సంస్థ ఈ రోజు వెల్లడించింది. యూఎస్‌కు చెందిన గ్లోబల్ లీడర్ అప్రూవల్ ట్రాకర్ మార్నింగ్ కన్సల్ట్ తెలిపిన వివరాల ప్రకారం.. భారతదేశ వయోజన జనాభాలో 71శాతం ప్రధాని నరేంద్ర మోడీకి గుడ్ అంటూ బెస్ట్ రేటింగ్ ఇచ్చారని తెలిపింది. ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన నాయకుడిగా మోడీ కొనసాగుతున్నారని వెల్లడిచింది. పరిశోధనా సంస్థ సర్వే చేసిన 13మంది నాయకులలో పీఎం మోడీ 71 శాతంతో టాప్లో ఉండగా.. మెక్సికోకు చెందిన ఆండ్రెస్ మాన్యుయెల్ లోపెజ్ ఒబ్రాడోర్ (66 శాతం), ఇటలీకి చెందిన మారియో డ్రాగి (60 శాతం), జపాన్‌కు చెందిన ఫ్యూమియో కిషిడా (48 శాతం) తర్వాతి స్థానాల్లో ఉన్నారు.
ప్రధాని మోడీ కూడా అత్యల్పంగా 21 శాతం అసమ్మతి రేటింగ్‌ను కలిగి ఉన్నారు. అయినా నరేంద్ర మోడీ ఆధిపత్యం కొనసాగుతోంది అని ఆ సర్వే తెలిపింది. కానీ, యూఎస్ ప్రెసిడెంట్ జో బిడెన్, కెనడాకు చెందిన జస్టిన్ ట్రూడో ఒక్కొక్కరు 43శాతం ఆమోదం పొందారు. వరుసగా ఆరు, ఏడవ స్థానాల్లో నిలిచారు. ‘పార్టీగేట్’ కుంభకోణంలో చిక్కుకున్న బ్రిటిష్ పీఎం బోరిస్ జాన్సన్ సర్వేలో పాల్గొన్న నాయకులలో 26 శాతం ఆమోదం రేటింగ్‌తో అత్యల్ప స్థానంలో నిలిచారు.
ఆంధ్రప్రభ న్యూస్ కోసంఫేస్‌బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..