కరోనా మహమ్మారి వెలుగులోకి వచ్చిన తరువాత భారత ప్రధాని మోదీ తొలిసారి ఓ విదేశీ టూర్ కు వెళ్లారు. ఇవాళ రేపు ప్రధాని మోదీ బంగ్లాదేశ్ లో పర్యటించనున్నారు. ఉదయం 7.45 గంటలకు బంగ్లాకు బయలుదేరిన ప్రధాని 11 లకు ఢాకా చేరుకున్నారు. ఇక కాసేపట్లో జాతీయ అమరవీరుల స్మారక స్థూపాన్ని సందర్శించి, నివాళులర్పించనున్నారు. అనంతరం బంగ్లాదేశ్ విదేశాంగ మంత్రి ఏకే అబ్దుల్ మోమెన్ మధ్యాహ్నం 3:15 గంటలకు ప్రధాని మోదీతో భేటీ కానున్నారు. ఆ తర్వాత 3:45 గంటలకు జాతీయ దినోత్సవ కార్యక్రమానికి హాజరవుతారు. అనంతరం రాత్రి 7:45 గంటలకు బాపు – బంగబందు డిజిటల్ వీడియో ఎగ్జిబిషన్‌ను ప్రధాని మోదీ ప్రారంభిస్తారు. గతేడాది డిసెంబర్‌లో బంగ్లా ప్రధానితో వీడియో సమావేశం ఫలవంతంగా జరగ్గా.. తాజా పర్యటనలో మరింత అర్ధవంతమైన చర్చలుంటాయని భావిస్తున్నారు. ప్రధాని షేక్ హసీనా, బంగ్లా అధ్యక్షుడు అబ్దుల్ హమీద్‌తో పాటు ఇతర బంగ్లా నేతలతో ఆయన సమావేశం కానున్నారు.
ఇవాళ, రేపు పర్యటించనున్న ప్రధాని..
Previous article
Next article
మరిన్ని వార్తలు
Advertisement
తాజా వార్తలు
Advertisement