దేశంలో ఆధార్ కార్డ్ మాదిరిగా త్వరలో ప్రతి ఒక్కరికి డిజిటల్ హెల్త్‌కేర్ ఐడీ అందుబాటులోకి రానుంది. కేంద్ర ప్రభుత్వ ప్రతిష్ఠాత్మక స్కీం ప్రధాన్‌మంత్రి డిజిటల్ హెల్త్ మిషన్ (పీఎం-డీహెచ్ఎం) ను ప్రధాని మోడీ ప్రారంభించనున్నారు. సోమవారం ఉదయం 11 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించనున్నారు.
గతేడాది ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా పైలట్ ప్రాజెక్టుగా పీఎం-డీహెచ్ఎంను ఆరు కేంద్ర పాలిత ప్రాంతాల్లో అమలు చేస్తామని ప్రకటించారు. ప్రస్తుతం అండమాన్ నికోబార్, చండీగఢ్, దాద్రా అండ్ నగర్ హవేలీ, డామన్ అండ్ డయూ, లడఖ్, లక్షద్వీప్, పుదుచ్చేరిల్లో ఈ పథకం అమలవుతోంది.