పదో తరగతి ప్రశ్నా పత్రాలను నారాయణ, చైతన్యస్కూల్స్ నుంచి లీక్ చేయించారని సీఎం జగన్ అన్నారు. రెండు పేపర్లు నారాయణ స్కూల్ నుంచి, మూడు పేపర్లు శ్రీచైతన్య స్కూల్ నుంచి లీక్ అయ్యాయని జగన్ ఆరోపించారు. వాళ్లే పేపర్ లీక్ చేసి ఏదో జరిగిపోయిందని ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. తిరుపతి పర్యటన నిమిత్తం తిరుపతి వచ్చిన జగన్ బహిరంగ సభలో పదో తరగతి ప్రశ్నా పత్రాల లీకేజీపై మాట్లాడారు.. దొంగే దొంగ అన్నట్లుగా ప్రచారం చేశారని.. వాట్సాప్ ద్వారా పేపర్‌లను బయటకు పంపి భయాందోళనలకు గురి చేయాలని చూశారని జగన్ విమర్శించారు. పేపర్ లీకులపై కొందరు దొంగ నాటకాలు ఆడుతున్నారని.. నారాయణ స్కూల్ ఎవరిదో తాను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదని.. ఆ స్కూల్ టీడీపీ నేతది కాదా అని నిలదీశారు.
దొంగనాటకాలు ఆడుతున్నారా -నారాయణ ,శ్రీచైతన్య స్కూల్ పై – సీఎం జగన్ ఫైర్
Advertisement
తాజా వార్తలు
Advertisement