Tuesday, November 19, 2024

Platinum Jubilee Celebration: ప్రజా పద్దుల (pac) సంఘానికి వందేళ్లు..

ప్ర‌జా ప‌ద్దుల సంఘం (public accounts committee) ఏర్ప‌డి 100 ఏళ్లు అవుతోంది. పార్ల‌మెంటులోని ప్యాన‌ళ్ల‌లో తొలిసారి ఏర్ప‌డిందిగా ఈ సంఘానికి గుర్తింపు ఉంది. 1921లో మాంటేంగు చేమ్స్ ఫోర్డ్ సంస్క‌ర‌ణ‌ల్లో భాగంగా ప్రజా పద్దుల సంఘాన్ని ఏర్పాటు చేశారు. ప‌బ్లిక్ అకౌంట్స్ క‌మిటీ ప్ర‌స్తుతం ప్ర‌తి ఏడాది ఏర్పాట‌వుతుంటుంది. ఈ క‌మిటీ చైర్మ‌న్‌ను లోక్‌స‌భ స్పీక‌ర్ నియ‌మిస్తారు. 1967 నుంచి ఈ క‌మిటీకి చైర్మ‌న్‌ను ప్ర‌తిప‌క్ష పార్టీ నుంచి ఎన్నుకుంటున్నారు. ప్ర‌స్తుతం ఈ క‌మిటీలో 22 మంది స‌భ్యులున్నారు. ఇందులో 15 మంది లోక్‌స‌భ నుంచి స్పీక‌ర్‌, ఏడుగురిని రాజ్య‌స‌భ నుంచి రాజ్య‌స‌భ చైర్మ‌న్ ఎంపిక చేస్తారు.

కాగ్ రిపోర్టును పరిశీలించడం..
ప్ర‌జా ప‌ద్దుల సంఘం ప‌ద‌వీకాలం ఏడాది ఉంటుంది. ప్ర‌భుత్వానికి పార్ల‌మెంటు ఇచ్చిన సొమ్మును (బ‌డ్జెట్‌) ప్ర‌భుత్వం స‌రిగా ఖ‌ర్చు చేసిందా లేదా ఈ సంఘం ప‌రిశీలిస్తుంది. కంట్రోల‌ర్ ఆడిట‌ర్ జ‌న‌ర‌ల్ (కాగ్‌) ఇచ్చిన ఆడిట్ రిపోర్టు పార్ల‌మెంటులో ప్ర‌వేశ‌పెట్టాక దాన్ని ప‌రిశీలించ‌డం ఈ సంఘం ముఖ్య‌మైన ప‌ని.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ఆంధ్రప్రభ న్యూస్ కోసం  ఫేస్‌బుక్‌,  ట్విట్టర్   పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement