బిర్యానీ … ఆ మాట అంటేనే నోట్లో నుంచి నీళ్లు ఊరిపోతాయి. అందులోనూ హైదరాబాద్ ధమ్ బిర్యానీ అంటే మరీనూ. అసలు బిర్యానీ అంటే ఇష్టపడనివాళ్లు ఎవరు ఉంటారు చెప్పండి. ఎన్నిసార్లు ఇంట్లో చేసుకుని తిన్నా రెస్టారెంట్‌కు వెళ్లి తింటే అదొక మజా. కానీ రెస్టారెంట్ అంటే తడిసి మోపెడవుతుంది. తక్కువలో తక్కువగా చూసినా ఒక ప్లేట్ బిర్యానీ రూ.150 అవుతుంది. అదే బిర్యానీ రూ.10 కు వస్తే.. ఏంటి కామెడీనా అనుకుంటున్నారా? అయితే హైదరాబాద్‌లోని అఫ్జల్‌గంజ్ అస్కా బిర్యానీ స్టాల్‌కు వెళ్లండి. నిజమండి అక్కడ బిర్యానీ కేవలం రూ.10 మాత్రమే. చూడడానికి పాత హోటల్‌లా కనిపించినా అక్కడ బిర్యానీ మాత్రం అదిరిపోతోంది. ఉదయం 7 గంటలకే తెరిచి… అర్థరాత్రి వరకూ అందుబాటులో ఉంచుతారు. పేదవాళ్లు, రోజువారీ కూలీలకు ఈ హోటల్ ప్రాణం పోస్తుందనే చెప్పాలి. రేటు తక్కువా? క్వాలిటీ బాగోదేమో? టేస్ట్ ఉండదేమో? అని అనుకుంటే మీరు తప్పులో కాలేసినట్టే. తక్కువ రేట్ అయినా బిర్యానీ క్వాలిటీతో సూపర్ టేస్ట్ ఉంటుందని అక్కడ తిన్నవారు చెబుతున్నారు. మరి మీరు కూడా ఒకసారి ట్రై చేయాలంటే ఛలో అస్కా బిర్యానీ స్టాల్.
Advertisement
తాజా వార్తలు
Advertisement