టేకాఫ్ అవుతుండగా ఓ పక్షిని ఢీకొంది విమానం..దాంతో అప్రమత్తమైన పైలట్ లక్నో ఎయిర్‌పోర్టులోనే విమానాన్ని అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు. తిరిగి ఫ్లైట్ బేలో దాన్ని పార్క్ చేశారు. సంబంధిత అధికారులు విమానానికి అన్ని రకాల చెకప్‌లు నిర్వహిస్తున్నారు.దాంతో ఎయిర్ ఏషియా విమానానికి తృటిలో పెను ప్రమాదం తప్పింది. లక్నో నుంచి కోల్‌కతాకు బయలుదేరిన ఎయిర్ ఏషియా విమానం i5 319 టేకాఫ్ అవుతూనే ఓ పక్షిని ఢీకొంది. ఎయిర్ ఏషియా ఫ్లైట్ ఆగిపోవడంతో అందులోని ప్రయాణికులను కిందకు దించేసి ఇతర ఫ్లైట్‌లలో వారిని సర్దుబాటు చేశారు. ప్రయాణికులు కిందకు దిగుతున్న దృశ్యాలను ఓ ప్యాసింజర్ వీడియోలో తీసి ట్విటర్‌లో షేర్ చేశాడు.
Advertisement
తాజా వార్తలు
Advertisement