ఓ కమర్షియల్ విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే అత్యవసరంగా ల్యాండింగ్ కావడంతో 136 ఫ్లైట్లను రద్దు చేసిన ఘటన కొలంబియాలో చోటుచేసుకుంది. కొలంబియాలోని మెడిల్లిన్‌కు సమీపంలోని ఓ ఎయిర్‌పోర్టులో కమర్షియల్ విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే అత్యవసరంగా ల్యాండింగ్ అయింది. దీంతో 136 ఫ్లైట్లను రద్దు చేసినట్లు సివిల్ ఏవియేషన్ డైరెక్టర్ జైర్ ఓర్లాండో పేర్కొన్నారు. ఫ్లైట్ల రద్దు వల్ల 21 వేల మందికి పైగా ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారని తెలిపారు. ఎల్ఏటీఎం ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఎయిర్ బస్ ఏ320 టేకాఫ్ అయిన కొద్దిసేపటికే దాని ఫ్రంట్ ల్యాండింగ్ గేర్‌లో సమస్య తలెత్తింది. ఈ సమస్యను గమనించిన పైలట్ తక్షణమే ల్యాండింగ్ చేశారు. అత్యవసరంగా విమానం ల్యాండ్ చేసినప్పటికీ, ఎవరికీ ఎలాంటి గాయాలు, ప్రమాదం సంభవించలేదని ఓర్లాండో స్పష్టం చేశారు. కమర్షియల్ ఫ్లైట్ అత్యవసరంగా ల్యాండింగ్ కావడంతో 12 గంటల పాటు ఇతర విమానాల రాకపోకలను రద్దు చేసినట్లు తెలిపారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement