తెలంగాణ రాష్ట్రంలో మత ఘర్షణలకు ప్లాన్ చేసిన మతోన్మాదుల పీఛమణిచేందుకు ప్రభుత్వం సీరియస్ యాక్షన్ తీసుకుంటోంది. ప్రశాంతంగా ఉన్న రాష్ట్రంలో ఘర్షణలు సృష్టించి, అల్లకల్లోలం చేయడానికి కొంతమంది దుష్ట పన్నాగం పన్నినట్టు సీఎం కేసీఆర్ కు ఇంటెలిజెన్స్ నిఘా వర్గాల ద్వారా సమాచారం అందింది. ఈమేరకు తెలంగాణ పోలీసులతో పాటు స్పెషల్ టీమ్స్‌ని రంగంలోకి దింపారు.
ఎమ్మెల్యే రాజాసింగ్ వివాదాస్పద వ్యాఖ్యలతో ఆ పార్టీ అతనినిని బహిష్కరించడం, తెలంగాణలోని పలు చోట్ల కేసులు నమోదు కావడం తెలిసిందే. అంతే కాకుండా బీజేపీకి చెందిన కొంతమంది చేస్తున్న మతోన్మాద వ్యాఖ్యలు, వివాదాస్పద వ్యాఖ్యలతో కలకలం చెలరేగుతోంది. వీటికి తోడు ముస్లిం యువత కూడా వీరికి వ్యతిరేకంగా చర్యలు తీసుకుంటున్నారు. నినాదాలు చేస్తూ ఆందోళనలకు దిగుతున్నారు. దీంతో స్పెషల్ పోలీసులు వారిని కట్టడి చేసే పనిలో పడ్డారు. ఇవ్వాల (గురువారం) ఓల్డ్ సిటీలో అల్లర్లకు ప్లాన్ చేస్తున్న వారిని గుర్తించి ఇండ్లల్లోకి వెళ్లి మరీ అదుపులోకి తీసుకున్నారు. ఇప్పుడీ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.
వీడియో కోసం www.prabhanews.com లో చూడండి