Saturday, November 23, 2024

Pitbull : గారంగా పెంచుకున్న పెంపుడు కుక్క.. పిట్​బుల్​ అటాక్​తో మహిళ మృతి

పెట్​ డాగ్​ లవర్స్​కి ఇది కాస్త బాధాకరమైన వార్త.​. ప్రేమగా పెంచుకున్న ఓ పెంపుడు కుక్క దాడి చేయడంతో ఉత్తరప్రదేశ్​లోని లక్నోలో ఓ మహిళ చనిపోయిన ఘటన వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించి మృతురాలి కుమారుడు తెలిపిన వివరాల ప్రకారం.. మృతురాలు ఒక రిటైర్డ్ టీచర్, ఆమె కొడుకు -జిమ్ ట్రైనర్​గా పనిచేస్తున్నాడు. అతనికి రెండు పెంపుడు కుక్కలున్నాయి. వీరు లక్నోలోని కైసర్‌బాగ్ ప్రాంతంలో నివసిస్తున్నారు. అతని వద్ద ఇంతకుముందే ఒక లాబ్రడార్​ ఉండేది. అయితే.. తన స్నేహితుడి నుంచి మరో పిట్‌బుల్ ని మూడేళ్ల క్రితం అడాప్ట్​ చేసుకున్నాడు.  

కాగా, మృతురాలి కొడుకు అమిత్ తన తన దగ్గరి బంధువు దగ్గరి నుంచే దీన్ని దత్తత తీసుకున్నాడు. అయితే.. తను ఎవరనే విషయాన్ని మాత్రం వెల్లడించేందుకు నిరాకరించాడు. దాన్ని అడాప్ట్​ చేసుకున్నప్పుడు లక్నో పౌర సంఘం నుంచి అన్ని చట్టపరమైన పత్రాలు, ఫార్మాలిటీలను పూర్తి చేశాడు. అయితే.. చాలా రోజుల నుంచి బాగానే ఉన్న పిట్​బుల్​ ఈ మధ్య దాని ప్రవర్తనలో తేడా వచ్చిందని, ఉన్నట్టుండి తన తల్లిపై అటాక్​ చేసినట్టు చెప్పాడు.

కాగా, అమిత్ తల్లిపై పిట్​బుల్​ దాడి చేసిన తర్వాత లక్నో మునిసిపల్ కార్పొరేషన్ ఆ కుక్కను నాగర్ నిగమ్ జంతు జనన నియంత్రణ కేంద్రానికి తరలించింది. అక్కడ దాని ప్రవర్తనను పరిశీలన చేశారు. అయితే.. తల్లి మరణించిన బాధలో ఉన్న అమిత్​, ఆ కుక్కను తిరిగి దాని మొదటి యజమానికి అప్పగించినట్టు సమాచారం. అది ఎందుకలా అటాక్​ చేసి చంపేసిందనే విషయం మాత్రం అంతుచిక్కడం లేదని కన్నీరుమున్నీరయ్యాడు అమిత్​.

Advertisement

తాజా వార్తలు

Advertisement