Monday, November 18, 2024

ఆర్ ఆర్ ఆర్ పై హైకోర్టులో ‘పిల్’ – ఎందుకో తెలుసా

చిక్కుల్లో చిక్కుకుంది ఆర్ ఆర్ ఆర్ చిత్రం. అల్లూరి సీతారామ‌రాజు, కొమురం భీం చ‌రిత్ర‌ను వ‌క్రీక‌రించార‌ని తెలంగాణ హై కోర్టులో పిల్ దాఖ‌ల‌యింది. ఈ ప్ర‌జా ప్ర‌యోజ‌న వ్యాజ్యాన్ని ఏపీ ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లాకి చెందిన స‌త్య‌వ‌ర‌పు, ఉండ్రాజ‌వ‌రానికి చెందిన అల్లూరి సౌమ్య దాఖ‌లు చేశారు. ఈ మేర‌కు ఆర్ ఆర్ ఆర్ చిత్రానికి సెన్సార్ స‌ర్టిఫికేట్ ఇవ్వొద్ద‌ని, ఈ చిత్రం రిలీజ్ పై స్టే ఇవ్వాల‌ని పిటిష‌న్ దారులు హైకోర్టుని కోరారు. జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ వెంకటేశ్వర రెడ్డి ధర్మాసనం ముందుకు ఈ వ్యాజ్యం రాగా.. ప్రజాప్రయోజన వ్యాజ్యం కావడంతో సీజే ధర్మాసనానికి బదిలీ చేసింది.

విడుద‌లకు ముందు నుంచే ట్రిపుల్ ఆర్ సినిమా వివాదాల‌తో స‌త‌మ‌త‌మ‌వుతోంది. కొమురం భీం క్యారెక్టర్ పై గతంలో ఆదివాసీల నుంచి తీవ్ర ప్రతిఘటన వచ్చింది. మరోవైపు కరోనా కారణంగా ఇప్పటికే పలు సార్లు వాయిదా పడింది. రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ అల్లూరి సీతారామ రాజుగా, ఎన్టీఆర్ కొమురం భీంగా నటిస్తుండగా.. రూ.450 కోట్ల భారీ బడ్జెట్ తో సినిమాను నిర్మించారు. ఈ సంక్రాంతికి జనవరి 7న ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉండగా… కరోనా కారణంగా వాయిదా వేస్తున్నట్లు చిత్ర యూనిట్ ఇటీవల అధికారికంగా తెలిపింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement