Tuesday, November 26, 2024

తెలంగాణ సర్కారుకు షాక్.. ప్రత్యక్ష విద్యాబోధనపై హైకోర్టులో పిల్

సెప్టెంబర్ 1 నుంచి విద్యాసంస్థలు ప్రారంభం అవుతున్న వేళ.. తెలంగాణ ప్రభుత్వానికి దిమ్మతిరిగే షాక్ తగిలింది. విద్యాసంస్థల్లో ప్రత్యక్ష బోధనపై హైకోర్టులో పిల్ దాఖలైంది. ప్రీ ప్రైమరీ, ప్రైమరీ తరగతులకు ప్రత్యక్ష బోధన ఆందోళన కలిగిస్తోందని పిటిషనర్ తన పిటిషన్‌లో పేర్కొన్నాడు. కరోనా మహమ్మారి మూడో దశ ముప్పు ఉన్న నేపథ్యంలో ప్రత్యక్ష బోధన సరికాదని పిటిషనర్ వెల్లడించారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను నిలిపివేయాలని పిటిషనర్ హైకోర్టును కోరారు.

ఈ కేసుపై ఈనెల 31న తాత్కాలిక సిజే జస్టిస్ రామ చంద్రరావు విచారణ చేపట్టనున్నారు. కాగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యాసంస్థల పునఃప్రారంభంపై ఇటీవలే కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. మరోవైపు రాష్ట్రంలో కరోనా అదుపులో ఉందని విద్యా సంస్థల ప్రారంభానికి ఇదే సరైన సమయమన్నారు మంత్రి సబితా ఇంద్రారెడ్డి. సెప్టెంబరు 1 నుంచి స్కూళ్లు ప్రారంభించనున్న నేపథ్యంలో మహబూబియా ప్రభుత్వ పాఠశాలను ఆమె తనిఖీ చేసి ఏర్పాట్లను పరిశీలించారు.

ఈ వార్త కూడా చదవండి: కేసీఆర్‌పై నిప్పులు చెరిగిన ప్రవీణ్ కుమార్

Advertisement

తాజా వార్తలు

Advertisement