Tuesday, November 26, 2024

అల‌ల తాకిడికి కూలిన 60ఏళ్ల వంతెన -ఐకానిక్ పీర్ ఎంతో ఫేమ‌స్

అల‌ల తాకిడికి రాక్ బీచ్ లోని ఐకానిక్ పీర్ వంతెన పాక్షికంగా కూలిపోయింద‌ని ఏఎన్ ఐ వార్తా సంస్థ ట్వీట్ చేసింది. ఈ వంతెన క‌ట్టి 60సంవ‌త్స‌రాల‌కి పైనే అవుతుంది. ఈ వంతెన ఎంతో ఫేమ‌స్ కూడా. బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కారణంగా.. పుదుచ్చేరి తీరంలో అలలు భారీగా ఎగసిపడుతున్నాయి. పలు చిత్రాల షూటింగ్‌లు ఇక్కడ జరిగాయి. హాలీవుడ్ బ్లాక్ బస్టర్ Life of Pie చిత్రంలో కూడా ఈ బ్రిడ్జి కనిపించింది. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం గత ఆరు గంటల్లో గంటకు 7 కి.మీ వేగంతో నైరుతి దిశగా కదులుతుంది. అది ప్రస్తుతం శ్రీలంక‌లోని కి ఈశాన్యంగా 310 కి.మీ దూరంలో, తమిళనాడులోని కి తూర్పు-ఈశాన్యంగా 260 కి.మీ. పుదుచ్చేరికి తూర్పు-ఆగ్నేయంగా 270 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉన్నట్టుగా భారత వాతావరణ శాఖ తెలిపింది. అయితే రానున్న 24 గంటల్లో అల్పపీడనం బలహీనపడే అవకాశం ఉంది. నైరుతిని ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతం, గల్ఫ్ ఆఫ్ మన్నార్, కొమోరిన్ ప్రాంతం, ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరాల వెంబడి సముద్ర పరిస్థితులు కల్లోలంగా ఉంటాయని ఐఎండీ నివేదిక పేర్కొంది. మత్స్యకారులు ఈ ప్రాంతాల్లోకి వేటకు వెళ్లవద్దని వాతావరణ శాఖ అధికారులు సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement