ఇకపై ప్రతీ ప్రభుత్వ కార్యాలయాల్లో బిఆర్ అంబేద్కర్, భగత్ సింగ్ ఫొటోలు ఉంటాయని తెలిపారు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్. ఇకపై రాజకీయా నేతలు, సీఎంల ఫొటోలు పెట్టమని సంచలన నిర్ణయాన్ని తీసుకున్నారాయన. గణతంత్ర దినోత్సవం సందర్భంగా జరిగిన ఓ కార్యక్రమంలో ఈ నిర్ణయాన్ని వెల్లడించారాయన. ప్రతి పిల్లవాడికి నాణ్యమైన విద్య అందించాలనే బిఆర్ అంబేద్కర్ కలలను నెరవేరుస్తామని ఈ రోజు మనం ప్రతిజ్ఞ చేస్తున్నామని కేజ్రీవాల్ అన్నారు. గత ఏడేళ్లలో విద్యారంగంలో విప్లవాన్ని తీసుకొచ్చామని… అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సతీమణి మెలానియా ట్రంప్ కూడా మా ప్రభుత్వ పాఠశాలలను సందర్శించారని గుర్తు చేశారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..