Friday, November 22, 2024

పిల్లలకూ కరోనా వ్యాక్సిన్.. టీకా రెడీ

ప్రపంచవ్యాప్తంగా ఓ వైపు కరోనావైరస్ విజృంభిస్తుంటే.. మరోవైపు వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా వేగవంతంగా జరుగుతోంది. అయితే వ్యాక్సిన్లు తీసుకుంటున్నప్పటికీ.. కొంతమంది కరోనా బారిన పడుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఈ క్రమంలో వ్యాక్సిన్ సమర్థతపై ఇంకా పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి.

కరోనా వ్యాక్సిన్‌ విషయంలో మరో కీలక ముందడుగు పడింది. ఇప్పటి వరకు పెద్దలకు మాత్రమే టీకా ఇస్తున్న విషయం తెలిసిందే. అయితే,  తాము అభివృద్ధి చేసిన టీకా పిల్లల్లోనూ సమర్థంగా పనిచేస్తోందని ఫైజర్‌ ప్రకటించింది.

12-15 ఏళ్ల వయసు గల పిల్లల్లో తమ టీకా వల్ల బలమైన రోగనిరోధక వ్యవస్థ ఏర్పడినట్లు ఫైజర్‌ ప్రకటించింది. 15 ఏళ్ల లోపు వయసున్న పిల్లల్లో ఫైజర్ టీకా.. కరోనా వ్యాధిని 100 శాతం నిరోధిస్తుందని తెలిపింది. అమెరికాలో మొత్తం 2260 మంది పిల్లలపై పరీక్షలు జరపగా.. టీకా సామర్థ్యం 100 శాతంగా ఉన్నట్టు తేలిందని పేర్కొన్నాయి. ఈ ట్రయల్స్ విజయవంతమయ్యాయని ఫైజర్, బయోఎన్‌టెక్ సంస్థలు తెలిపాయి. ఒక్కరిలోనూ కొవిడ్‌ కేసులు నమోదు కాలేదని తెలిపింది. పిల్లల చదువులకు సంబంధించి ప్రపంచవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతున్న వేళ.. ఫైజర్ తాజా ప్రకటనతో సంతోషాన్ని కలిగిస్తోంది. పాఠశాలలను తెరిచే విషయంలో ఇది ఓ ముందడుగు కానుందని ఫైజర్‌ అభిప్రాయపడింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement