Saturday, November 23, 2024

దేశంలోని ప్రధాన నగరాల్లో పెట్రో రేట్లు.. హైదరాబాద్లో ఎంతంటే..?

పెట్రోలు, డీజిల్​పై కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించిన తర్వాత దేశ వ్యాప్తంగా ఇంధన ధరలు కాస్త తగ్గుముఖం పట్టాయి. కాగా, ఇవ్వాల సోమవారం ఇంధన ధరలు యథాతథంగా ఉన్నాయి. పెట్రోలుపై లీటరుకు రూ.8, డీజిల్‌పై రూ.6 చొప్పున ఎక్సైజ్ సుంకాన్ని తగ్గిస్తున్నట్లు కేంద్ర మంత్రి నిర్మలా శనివారం ప్రకటించారు. దీంతో ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.96.72కు తగ్గగా, లీటర్ డీజిల్ ధర రూ.89.62గా ఉంది. మహారాష్ట్ర ప్రభుత్వం ఆదివారం పెట్రోల్, డీజిల్‌పై విలువ ఆధారిత పన్ను (వ్యాట్)ను తగ్గించింది. పెట్రోల్‌పై వ్యాట్‌ను లీటర్‌కు రూ.2.08 తగ్గించగా డీజిల్‌పై లీటర్‌కు రూ.1.44 తగ్గించారు. కాబట్టి, ముంబైలో తాజా ఎక్సైజ్ సుంకం తగ్గింపు తర్వాత పెట్రోల్ లీటరుకు రూ. 111.35 వద్ద రిటైల్ అవుతుండగా, డీజిల్ లీటరు రూ. 97.28కి అమ్ముతున్నారు.

కాగా, కోల్‌కతాలో తాజా పెట్రోల్ ధర లీటరుకు రూ. 106.03 వద్ద ఉండగా, డీజిల్ ధర లీటరుకు రూ. 92.76గా ఉంది. చెన్నైలో ఆదివారం లీటర్ పెట్రోల్ రూ.102.63, డీజిల్ రూ.94.24గా విక్రయిస్తున్నారు. పంజాబ్‌లోని చండీగఢ్‌లో పెట్రోల్ ధర రూ.96.20గా ఉండగా, డీజిల్ ధర లీటరుకు రూ.84.26గా ఉంది.

హైదరాబాద్​, ఢిల్లీ, ముంబై, చెన్నై దేశంలోని ఇతర ప్రధాన నగరాల్లో సోమవారం (మే 23న) పెట్రోల్, డీజిల్ ధరలు:

హైదరాబాద్ : పెట్రోలు: లీటరుకు రూ. 109.66, డీజిల్: లీటరుకు రూ. 97.82

ఢిల్లీ: పెట్రోలు: లీటరుకు రూ. 96.72, డీజిల్: లీటరుకు రూ. 89.62

- Advertisement -

ముంబై : పెట్రోలు: లీటరుకు రూ. 111.35, డీజిల్: లీటరుకు రూ. 97.28

కోల్‌కతా : పెట్రోలు: లీటరుకు రూ. 106.03, డీజిల్: లీటరుకు రూ. 92.76

చెన్నై : పెట్రోలు: లీటరుకు రూ. 102.63, డీజిల్: లీటరుకు రూ. 94.24

భోపాల్ : పెట్రోలు: లీటరుకు రూ. 108.65, డీసెల్: లీటరుకు రూ. 93.90

బెంగళూరు : పెట్రోలు: లీటరుకు రూ. 101.94, డీజిల్: లీటరుకు రూ. 87.89

గౌహతి : పెట్రోలు: లీటరుకు రూ. 96.01, డీజిల్: లీటరుకు రూ. 83.94

లక్నో : పెట్రోలు: లీటరుకు రూ. 96.57 డీజిల్: లీటరుకు రూ. 89.76

గాంధీనగర్ : పెట్రోలు: లీటరుకు రూ. 96.63, డీజిల్: లీటరుకు రూ. 92.38

తిరువనంతపురం : పెట్రోలు: లీటరుకు రూ. 107.71, డీజిల్: లీటరుకు రూ. 96.52.

Advertisement

తాజా వార్తలు

Advertisement