Tuesday, November 26, 2024

స్థిరంగా పెట్రో ధరలు.. హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ ఎంతంటే..

చమరు ధరలు భగభగ మండిపోతున్నాయి. పెట్రోల్, డీజిల్ ధరలు మంగళవారం స్థిరంగా ఉన్నాయి. దేశీయ చమురు మార్కెటింగ్ కంపెనీలు నేడు ధరలను యథాతథంగా ఉంచాయి. దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.101.19, లీటర్ డీజిల్ ధర రూ.89.72గా ఉంది. నిన్న పెట్రోల్ ధర పెరగగా, డీజిల్ ధర తగ్గిన విషయం తెలిసిందే. దేశ ఆర్థిక రాజధాని ముంబై నగరంలో పెట్రోల్ ధర రూ.107 దాటింది.  డీజిల్ 27 పైసలు తగ్గి రూ.97.29 వద్ద ఉంది. చెన్నైలో లీటర్ పెట్రోల్ రూ.101.92, లీటర్ డీజిల్ రూ.94.24,హైదరాబాద్‌లో లీటరు పెట్రోల్ ధర రూ.105.15 వద్ద ఉంది. ఇక డీజిల్ ధర రూ.97.78 వద్ద కొనసాగుతోంది. కాగా, పెట్రోల్ ధర మే నుంచి ఇప్పటి వరకు లీటరుకు ఏకంగా రూ.10.79 పెరిగింది. అదేసమయంలో డీజిల్ ధర లీటరుకు రూ.8.99 పైకి కదిలింది. ఇంధన ధరలు ఏకంగా 39 సార్లు పెరిగాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement