దేశంలో పెరిగిన పెట్రోల్ ధరలు సామన్యుడికి చిర్రెత్తుకొచ్చేలా చేస్తున్నాయి. పెట్రో ధరలు చుక్కలను అంటుతున్నాయి. రూ.100 మార్క్ ఎప్పుడో దాటేసింది. డీజిల్ ధర కూడా అలానే ఉంటుంది. దీంతో సామాన్యుడి నడ్డి విరుగుతుంది. ఏ చిన్న పనికి అయినా.. ఎలా వెళ్లాలని అంటున్నారు. పెట్రో ధరలపై అక్కడ అక్కడ నిరసనలు కూడా వస్తున్నాయి. పెట్రోల్, డీజిల్ ధరలు వంద రూపాయలు దాటడంతో సగటు మానవుడు నిత్యవసరాలకు డబ్బులు వెచ్చించలేక నానా అవస్థలు పడుతున్నాడు. పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడంతో వాటి ప్రభావం అన్ని అమ్మకాలపై పడుతోంది. దీంతో ఇప్పటికే దేశవ్యాప్తంగా చమురు ధరలపై ఆగ్రహజ్వాలలు వెల్లువెత్తుతున్నాయి. కాగా పెరిగిన పెట్రో ధరలకు నిరసనగా గద్వాల జిల్లాలో ఓ వ్యక్తి తన వాహనానికి నిప్పటించాడు. జోగులాంబ గద్వాల జిల్లా ధరూరు మండల కేంద్రానికి చెందిన కుర్వ ఆంజనేయులు బుధవారం మధ్యాహ్నం స్థానిక వైఎస్‌ఆర్ చౌరస్తాలో అకస్మాత్తుగా తన ద్విచక్ర వాహనానికి నిప్పంటించాడు. స్థానికులు గమనించి ద్విచక్ర వాహనంపై నీరుపోసి మంటలను ఆర్పారు.
పెరిగిన పెట్రోల్ ధరలకు నిరసనగానే తాను వాహనానికి నిప్పంటించానని చెబుతున్నాడు ఆంజనేయులు. తాను వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నానని, పెట్రోల్ అధిక ధరలు పెనుభారంగా మారాయని ఆంజనేయులు ఆవేదన వ్యక్తం చేశాడు. మోటారు సైకిల్‌కు పెట్రోల్ పోయించలేని స్థితిలో విసుగు చెంది దహనం చేసినట్లు చెప్పాడు. లీటర్ పెట్రోల్ రూ.100 కన్నా ఎక్కువ ఉండటం ఆందోళన కలిగిస్తోంది. ప్రజల జీవన ప్రమాణ స్థాయి పెరిగిందని చెప్పి.. ధరలను పెంచుతున్నారు. మరీ వేతనాల సంగతి ఏంటీ అని జనం అడుగుతున్నారు. జీతం పెంచారా అని ప్రశ్నిస్తున్నారు. కరోనా వైరస్ పేరు చెప్పి ఉద్యోగాలు కూడా తీసి వేసే పరిస్తితి ఉందని వివరించారు. మరీ అలాంటి సమయంలో పెట్రో ధరలను పెంచడం ఎంతవరకు సమంజమని సామన్యుడు ప్రశ్నిస్తున్నాడు.
ఇది కూడా చదవండి: Virat kohli: సెంచరీ లేని అర్థసెంచరీ