దేశవ్యాప్తంగా ఇంధన ధరలు మరోసారి పెరిగాయి. సోమవారం లీటర్ పెట్రోల్‌పై 29 పైసలు, డీజిల్‌పై 28 పైసలు పెరుగుదల నమోదైంది. వాణిజ్య రాజధాని ముంబైలో లీటరు పెట్రోల్ ధర రూ.100 వద్ద కొనసాగుతోంది. అక్కడ లీటరు పెట్రోల్ ప్రస్తుతం రూ.100.47, డీజిల్ ధర లీటరుకు రూ. 92.25 పెరిగినట్లు ప్రభుత్వ ఇంధన రిటైలర్ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ పేర్కొంది. ఇక దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోల్ రేటు లీటరుకు రూ.94.23, డీజిల్ రూ.85.15. దేశంలో మే 3 నుంచి ఇంధన ధరలు.. పెట్రోల్ లీటరు ధర రూ. 3.83, డీజిల్ రేటు రూ.4.42 పెరగటం గమనార్హం.
Advertisement
తాజా వార్తలు
Advertisement