Friday, November 22, 2024

12రోజుల్లో రూ.7.20 పెరిగిన పెట్రోల్ ధర..

పెట్రోల్‌, డీజిల్‌ శనివారం మళ్లీ పెరిగాయి. మార్చి 22వ తేదీ నుంచి వరుసగా పెరుగుతున్న పెట్రోధరలు ఏప్రిల్‌ 2న కూడా పెరిగాయి. గత 12రోజుల వ్యవధిలో కేవలం రెండు రోజులు మాత్రమే స్థిరంగా ఉన్నాయి. ఒక రోజు మాత్రం 30పైసలు పెరిగిన ధరలు మిగిలిన తొమ్మదిసార్లు 80పైసల చొప్పున పెరిగాయి. తాజా పెంపుతో దేశ రాజధాని ఢిల్లిdలో పెట్రోల్‌ రూ.102.61, డీజిల్‌ 93.87గా నమోదైంది. మార్చి 22వ తేదీ నుంచి ఈ పన్నెండు రోజుల్లో పెట్రోల్‌ ధర రూ.7.20కు పెరిగింది.

ముంబైలో పెట్రోల్‌ రూ.117.79, డీజిల్‌ రూ.101.79, హైదరాబాద్‌ లీటర్‌ పెట్రోల్‌ రూ.115.42కు చేరుకోగా డిజిల్‌ రూ.101.58కి చేరుకుంది. కాగా విమాన ఇంధనం జెట్‌ ఫ్యూయల్‌ ధర కూడా లీటర్‌ రూ.1,12,924.83కు చేరుకుంది. రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం కారణంగా అంతర్జాతీయంగా చమురు ధరలకు రెక్కలు వచ్చాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement