Friday, November 22, 2024

పెట్రోల్​ ధర తగ్గింపుపై నెట్టింట దుమారం.. బీజేపీ లీడర్లకు మీమ్స్​తో ట్రోలింగ్​​!

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం.. ఆ పార్టీ విధానాలు, లీడర్ల మాటల తీరు ఇప్పుడు సోషల్​ మీడియాలో చర్చనీయాంశం అవుతోంది. పెట్రోల్​ రేట్లనే పరిశీలనకు తీసుకుంటే.. కొవిడ్​ తర్వాత కేంద్ర ప్రభుత్వం దాదాపు 43 రూపాయలను పెంచింది. ఎక్సైజ్​ సెస్​ రూపంలో పలు దఫాలుగా ఈ అమౌంట్​ పెరిగింది. దీంతో మొన్నటిదాకా లీటర్​ పెట్రోల్​ 120 రూపాయలకు చేరింది. ఇక.. మొన్న కేంద్రం ఎక్సైజ్​ సెస్​ని 7 రూపాయలు తగ్గించుకోవడంతో పెట్రోల్​ ధరలో స్వల్ప మార్పు జరిగింది. ప్రస్తుతం లీటర్​ పెట్రోల్​ ధర 110 రూపాయల దాకా ఉంది.

అయితే.. ఇక్కడ జనాలు వెర్రోళ్లు, ఏం తెలియదు అనుకున్న బీజేపీ లీడర్లు రాష్ట్రాలు వ్యాట్​ తగ్గించుకోవాలని, పెట్రోలు ధర పెరగడానికి రాష్ట్రాలే కారణమని మాట్లాడుతున్నారు. ఒకప్పుడు అంటే వాళ్లు ఏం చెప్పినా నడిచేది.. ఇప్పుడు సోషల్​ మీడియా యుగమాయే.. బీజేపీ లీడర్ల మాటల మీద ఇక నెట్టింట జనాలు తెగ ఆడేసుకుంటున్నారు. కొందరైతే బూతులతో అభిషేకం చేస్తుంటే.. ఇంకొందరు పొలైట్​గా మొట్టికాయలు వేస్తున్నారు.

కొన్ని మీమ్స్​ జనాలను తెగ ఆకట్టుకుంటున్నాయి. వాటిలో సమాచారంతో పాటు ఫన్నీ కూడా ఉండడంతో సోషల్​ మీడియాలో వైరల్​ అవుతున్నాయి..

Advertisement

తాజా వార్తలు

Advertisement