చమరు కంపెనీలు వాహనదారులకు చుక్కులు చూపిస్తున్నాయి. నిత్యం పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలతో సామాన్యులు, వాహనదారులు లబోదిబోమంటున్నారు. ఇప్పటికే చాలా ప్రాంతాల్లో పెట్రోల్ ధరలు వంద మార్క్ దాటాయి. తాజాగా మరోసారి పెరిగాయి. బుధవారం లీటర్ పెట్రోల్ పై 26 పైసలు,డీజిల్ పై 13పైసలు పెరిగింది. దీంతో హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ రూ.100.46 కాగా డీజిల్ ధర రూ. 95.28 గా ఉంది. దేశంలోని ప్రధాన నగరాల్లో చమురు కంపెనీలు ధరల్ని పెంచాయి. ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ. 96.66 రూపాయలుకాగా.. లీటర్ డీజిల్ ధర రూ .87.28కు చేరింది. ముంబైలో పెట్రోల్ ధర రూ. 102.82, డీజిల్ ధర రూ.94.84 కు ఉంది. దేశంలో అత్యధికంగా రాజస్థాన్ లోని శ్రీ గంగానగర్ జిల్లాలో పెట్రోల్ ధర రూ. 107 ఉండగా, డీజిల్ ధర లీటర్ కు రూ.100.51 గా ఉంది. కాగా, ఇటీవల పలు రాష్ట్రాల ఎన్నికల ముగిసిన నాటి నుంచి దేశంలో పెట్రోల్ ధరలు నిత్యం పెరుగుతున్నాయి.
Advertisement
తాజా వార్తలు
Advertisement