Thursday, November 21, 2024

Petrol in Delhi: కేజ్రీవాల్ సర్కార్ సంచలన నిర్ణయం.. ఢిల్లీలో రూ.8 తగ్గిన పెట్రోల్ ధర!

దేశంలో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు విపరీతంగా పెరిగిన నేపథ్యంలో ఇటీవల కేంద్రం ధరలను తగ్గించిన సంగతి తెలిసిందే. పెట్రోల్‌ పై రూ.5, డీజిల్‌ పై రూ. 10 మేర ఎక్సైజ్‌ సుంకాన్ని తగ్గించింది. కేంద్ర ప్రభుత్వం సూచనల దేశంలోని చాలా రాష్ట్రాలకు ఎక్సైజ్ సుంకాన్ని కూడా తగ్గించాయి. బీజేపీ పాలిత రాష్ట్రాలతోపాటు పంజాబ్, ఛత్తీస్ గఢ్ లాంటి బీజేపీ యేతర రాష్ట్రాలు కూడా వ్యాట్ ను తగ్గించాయి. దీంతో దేశ వ్యాప్తంగా పెట్రోల్‌, డీజిల్‌ ధరలు కాస్త తగ్గాయి. తాజా ఢిల్లీలోని ఆప్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పెట్రోల్‌పై వ్యాట్‌ను 30% నుండి 19.40%కి తగ్గిస్తున్నట్లు నిర్ణయం తీసుకుంది. ఈరోజు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ నిర్ణయంతో దేశ రాజధాని ఢిల్లీలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.8 మేర తగ్గనుంది. ఈ కొత్త రేట్లు ఈ రోజు అర్ధరాత్రి నుండి అమలులోకి రానుంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ఆంధ్రప్రభ న్యూస్ కోసం  ఫేస్‌బుక్‌ట్విట్టర్  పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement