Friday, November 22, 2024

Petrol, Diesel Prices: ఆగని పెట్రో బాదుడు.. 14 రోజుల్లో 12 సార్లు పెంపు

దేశంలో పెట్రో బాదుడు కొనసాగుతోంది. సోమవారం కూడా పెట్రోల్, డీజిల్ ధరలను పెంచుతూ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల నిర్ణయం తీసుకున్నాయి. లీటరుపై పెట్రోల్, డీజిల్‌పై 40 పైసలు పెంచాయి. తాజా పెంపుతో న్యూఢిల్లీలో పెట్రోల్‌ ధర రూ.103.81, డీజిల్‌ రూ.95.07కు చేరింది. ముంబైలో పెట్రోల్‌పై 84 పైసలు పెరగడంతో రూ.118.83కు పెరగగా, డీజిల్‌పై 43 పైసలు అధికమవడంతో రూ.103.07కు చేరింది. హైదరాబాద్‌లో లీటరు పెట్రోల్ ధర రూ.117.23కు చేరుకుంది. అలాగే డీజిల్ ధర రూ.103.32గా నమోదైంది. విజయవాడలో లీటరు పెట్రోల్ ధర రూ.119.89గా ఉండగా.. లీటరు డీజిల్ ధర రూ.105.54గా నమోదైంది.

గత 14 రోజుల వ్యవధిలో చమరు ధరలు పెరుగడం ఇది పన్నెండోసారి. మొత్తంగా లీటర్‌ పెట్రోల్‌పై రూ.9.44, డీజిల్‌పై రూ.9.10 పెరిగింది. వరుసగా గ్యాప్‌ లేకుండా చమురు ధరలు పెరగడంతో సామాన్యుల జేబులు గుల్ల చేస్తున్నది. మార్చి 22న ప్రారంభమైన ధరల మోత నేటికి కొనసాగుతూనే ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement