దేశంలో చమరు ధరలు భగభగ మండిపోతున్నాయి. ప్రతిరోజు ప్రెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతున్నాయి. చేశాయి. ఈ సంస్థలు ఇంధన ధరల పెంపునకు ఒక్క రోజు మాత్రమే విరామం ఇచ్చాయి. నిన్న నిలకడగా కొనసాగిన పెట్రోల్, డీజిల్ రేట్లు.. ఇవాళ ఉగాది పండుగ రోజున మళ్లీ పెరిగాయి. దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్, లీటర్ డీజిల్ పై 80 పైసలు పెరిగింది. దీంతో ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ. 102.61 కు చేరగా డీజిల్ ధర రూ. 93. 87కు పెరిగింది. ఆర్థిక ముంబైలో పెట్రోల్, డీజిల్ పై 85 పైసలు పెరిగింది. దీంతో లీటర్ పెట్రోల్ ధర రూ. 117.57కు చేరగా.. డీజిల్ ధర రూ. 101.79కు ఎగసింది. ఇక, హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ ధర రూ. 115.42 కు చేరగా డీజిల్ ధర రూ. 101.58గా నమోదైంది. విజయవాడలో లీటర్ పెట్రోల్ ధర రూ. 117. 35కు ఉండగా.. డీజిల్ ధర రూ. 103.13కు చేరుకుంది. కాగా, గత 12 రోజుల్లో మొత్తంగా రూ. 7.20 పెరిగాయి.
Advertisement
తాజా వార్తలు
Advertisement