Monday, November 18, 2024

మండిపోతున్న పెట్రోల్ ధరలు.. నేటి రేట్లు ఇవీ

దేశంలో పెట్రోలు ధరలు భగభగ మండిపోతున్నాయి. నాన్ స్టాప్ గా పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలు సామాన్యుడికి చుక్కలు చూపిస్తున్నాయి. తాజాగా శుక్రవారం చమరు ధరలు మరోసారి పెరిగాయి. లీటర్ పెట్రోల్ పై 35 పైసలు, లీటర్ డీజిల్ పై 35 పైసలు పెరిగింది. తాజా పెరుగుదలతో ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ. 106.89 చేరగా.. లీటర్ డీజిల్ ధర రూ. 95.62 కు చేరింది.

హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ ధర రూ. 111.18 చేరగా.. డీజిల్ ధర రూ. 104. 32 కు చేరింది. ఇక, విజయవాడలో లీటర్ పెట్రోల్ ధర రూ. 112.90 కాగా డీజిల్‌ ధర రూ. 105.42 గా నమోదైంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ. 112.78 ఉండగా.. డీజిల్ ధర రూ.103.63కు చేరింది. కోల్‌ కత్తాలో లీటర్ పెట్రోల్ ధర రూ. 107.45 చేరగా.. డీజిల్ ధర రూ. 98.73 కు చేరింది. చెన్నైలో లీటర్ పెట్రోల్ ధర రూ. 103.92 చేరగా.. డీజిల్ ధర రూ. 99.92 కు చేరింది.

ఇది కూడా చదవండి: Good News: త్వరలోనే పోలీస్ శాఖలో ఖాళీల భర్తీ: సీఎం జగన్

Advertisement

తాజా వార్తలు

Advertisement