దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు మండిపోతున్నాయి. ప్రతిరోజు ధరలను పెంచుతూ సామాన్యులను చుక్కులు చూపిస్తున్నాయి చమరు కంపెనీలు. పెరుగుతున్న ధరలతో వాహనదారులు తమ వాహనాలను బయటకు తీయాలంటే జంకుతున్నారు. రోజుకో కొత్త రికార్డును సృష్టిస్తున్నాయి. శనివారం పెట్రోల్‌పై 35 పైసలు, డీజిల్‌పై 35 పైసలు పెరిగింది. దీంతో హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ రేటు 110.08కి పెరిగింది. లీటర్ డీజిల్ రేటు 103.15కు చేరింది. ఢిల్లీలో లీటరు పెట్రోల్ ధర రూ.105.49కి చేరింది. కాగా, గడిచిన 16 రోజుల్లో లీటర్ పెట్రోల్ రేటు రూ. 4.08, డీజిల్ పై రూ. 4.76 పెరిగింది.
ఇది కూడా చదవండి: వరల్డ్ ఫుడ్ డే ఎలా మొదలైంది? ఎప్పుడు మొదలైంది?