Saturday, November 23, 2024

తగ్గేదే లే: వరుసగా మూడో రోజు పెట్రో మోత!

దేశంలో పెట్రోల్, డీజిల్ ధ‌ర‌లు మ‌ళ్లీ పెరుగుతున్నాయి. వ‌రుస‌గా మూడో రోజూ వాహ‌ణ‌దారుల‌పై భారం మోపాయి దేశీయ చ‌మురు కంపెనీలు. నిన్న లీట‌ర్ పెట్రోల్‌పై 19 పైస‌లు, లీటర్ డీజిల్‌పై 21 పైసల చొప్పున పెంచ‌గా, ఇవాళ మరోసారి 25 పైస‌లు, 30 పైస‌ల చొప్పున బాదాయి. దీంతో దేశ రాజ‌ధాని ఢిల్లీలో లీట‌ర్ పెట్రోల్ ధ‌ర రూ.90.99, డీజిల్‌ రూ.81.42కు చేరింది. ఇక తాజా పెంపుతో ముంబైలో పెట్రోల్ రూ.97.34, డీజిల్‌ రూ.88.39, చెన్నైలో పెట్రోల్‌ రూ.92.90, డీజిల్‌ రూ.86.35, కోల్‌కతాలో పెట్రోల్‌ రూ.91.14, డీజిల్‌ రూ.84.26కు చేరాయి. బెంగ‌ళూరులో పెట్రోల్‌ రూ.94.01, డీజిల్‌ రూ.86.31కు, హైద‌రాబాద్‌లో పెట్రోల్‌ రూ.94.57, డీజిల్‌ రూ.88.77కు,

కాగా, ఐదు రాష్ట్రాల్లో ఎన్నిక‌ల నేప‌థ్యంలో స్థిరంగా ఉన్న పెట్రోల్, డీజిల్ ధ‌ర‌లు.. ఫ‌లితాలు వెలువ‌డిన మరుస‌టి రోజు నుంచే దేశీయ చ‌మురు కంపెనీలు ధ‌ర‌ల‌ను పెంచుతూ వ‌స్తున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement