Saturday, November 23, 2024

Flash: మొదలైన పెట్రో బాదుడు.. రెండో రోజూ పెరిగిన ధరలు.. నేటి రేట్లు ఇవీ

దేశంలో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు వరుసగా రెండో రోజూ పెరిగాయ. నాలుగు నెలలపాటు విరామం తర్వాత నిన్నటి నుంచి దేశీయ చమురు కంపెనీలు పెట్రోల్, డీజిల్ ధరల పెంపుదలను ప్రారంభించాయి. తాజాగా నేడూ ధరలు పెరిగాయి. ఈ రోజు లీటరు పెట్రోలుపై 90 పైసలు, డీజిల్‌పై 87 పైసలు పెరిగింది. దీంతో హైదరాబాద్‌లో లీటర్ పెట్రోలు రూ. 110కి చేరుకోగా, డీజిల్ ధర రూ.96.36కి చేరుకుంది. నిన్న పెట్రోలు రూ.109.10, డీజిల్‌ రూ.95.50గా ఉన్నాయి.

ఇక, ఏపీలో పెట్రోలుపై 87 పైసలు, డీజిల్‌పై 84 పైసలు పెరిగింది. దీంతో గుంటూరులో లీటరు పెట్రోలు ధర రూ. 112.08కి చేరుకోగా, డీజిల్ ధర రూ. 98.10కి పెరిగింది. విజయవాడలో పెట్రోల్‌ రూ.111.88, డీజిల్‌ రూ.97.90కి చేరింది.

కాగా, 137 రోజుల విరామం నిన్నటి నుంచి పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుద మొదలైంది. ఉత్తరప్రదేశ్, పంజాబ్ వంటి రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికలకు ముందు నవంబర్ 4 నుండి ధరలు పెరుగుదలకు బ్రేక్ పండింది. అయితే, ఈ కాలంలో ముడిసరుకు (ముడి చమురు) ధర బ్యారెల్‌కు USD 30 పెరిగింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement