దేశవ్యాప్తంగా పెట్రో ధరలు నేడు కూడా పెరిగాయి. తాజాగా లీటరు పెట్రోలుపై 91 పైసలు, డీజిల్‌పై 87 పైసలు పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. తాజా ధరల పెంపుతో హైదరాబాద్‌లో లీటరు పెట్రోలు ధర రూ. 117.21కి చేరుకుంది. డీజిల్ ధర రూ. 103.03కి చేరుకుంది. ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరులో లీటరు పెట్రోలుపై 87 పైసలు, డీజిల్‌పై 84 పైసలు పెరిగింది. దీంతో లీటర్ పెట్రోలు ధర రూ. 119.07, డీజిల్ ధర రూ. 104.78కి చేరుకుంది. దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్, లీటర్ డీజిల్ పై 80 పైసలు పెరిగింది. దీంతో ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ. 103.41 కు చేరగా డీజిల్ ధర రూ. 94.67 కు పెరిగింది. ముంబై లో లీటర్ పెట్రోల్, లీటర్ డీజిల్ పై 85 పైసలు పెరిగింది. దీంతో లీటర్ పెట్రోల్ ధర రూ. 118.41, కు చేరగా డీజిల్ ధర రూ. 102.64 కు పెరిగింది. పెట్రోలు, డీజిల్ ధరలు పెరగడం గత 13 రోజుల్లో ఇది 11వ సారి కావడం గమనార్హం. కాగా, ఈ 11 రోజుల్లో పెట్రోలు, డీజిల్ ధరలు రూ.8 రూపాయలకు పైనే పెరిగింది.
Advertisement
తాజా వార్తలు
Advertisement