దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు అడ్డు అదుపులేకుండా పెరుగుతోన్నాయి. దీంతో సామాన్యులపై ధరల భారం పెరుగుతోంది. గత రెండు నెలల నుంచి పెట్రోలు ధరల సూచీలు పైకి కదులుతూనే ఉన్నాయి. తాజాగా మంగళవారం చమురు కంపెనీలు పెట్రోల్‌పై 35 పైసలు, డీజిల్‌పై 31 పైసలు వరకు పెంచాయి. తాజాగా పెరిగిన ధరలతో దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.98.81, డీజిల్ లీటర్ రూ.89.18కు పెరిగింది. గత నెల నుంచి ఇప్పటి వరకు 33 సార్లు లీటర్ పెట్రోల్‌పై రూ.8.49, డీజిల్‌పై రూ.8.39 పెరిగింది. మరో వైపు దేశ ఆర్థిక రాజధాని ముంబై మహానగరంలో పెట్రోల్ రూ.105 వైపు పరుగులు పెడుతున్నది. ప్రస్తుతం లీటర్ ధర రూ.104.90 పలుకుతోంది. మరో వైపు రాజస్థాన్‌లోని శ్రీగంగానగర్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.110.04, డీజిల్ రూ.102.42కు పెరిగింది. గత కొద్ది రోజులుగా పెరుగుతూ వస్తున్న ఇంధన ధరలతో సామాన్యులు బంకులకు వెళ్లాలంటేనే జంకాల్సిన పరిస్థితి ఎదురవుతోంది. మరో వైపు తెలుగు రాష్ట్రాల్లోని అన్ని జిల్లాల పరిధిలో లీటర్ పెట్రోల్ ధర రూ.100 మార్క్‌ను దాటగా.. డీజిల్ ధర రూ.100 వైపు పరుగులు పెడుతున్నది.
మరోసారి పెరిగిన పెట్రో ధరలు..
- Tags
- breaking news telugu
- Business
- Business Analyst
- Business Latest News
- BUSINESS NEWS
- diesel and petrol prices
- important news
- Important News This Week
- Important News Today
- latest breaking news
- Latest Important News
- latest news telugu
- Most Important News
- PETROL PRICES
- Small Business
- telugu breaking news
- Telugu Daily News
- telugu epapers
- Telugu Important News
- telugu latest news
- telugu news online
- Telugu News Updates
- telugu trending news
- today business news
- Today News in Telugu
- Top News Stories
- Top News Stories Today
- Top News Today
- Top Stories
- Top Stories Today
- Trending Stories
- viral news telugu
Previous article
Next article
మరిన్ని వార్తలు
Advertisement
తాజా వార్తలు
Advertisement