దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుదలకు అడ్డు అదుపులేకుండా పోతోంది. నిత్యం పెట్రో ధరలు పెరుగుతుండటంతో అటు నిత్యవసరాల ధరలు కూడా పెరుగుతున్నాయి. దీంతో సమాన్యులు పాలిట ధరల పెంపు గుదిబండగా మారింది. ఇక పెట్రో ధరలు ఆదివారం మరోసారి పెరిగాయి. శుక్రవారం కేవలం పెట్రోల్ ధర పెంచిన చమురు కంపెనీలు.. తాజాగా డీజిల్ ధరలను సైతం పెంచాయి. తాజాగా పెట్రోల్‌పై 36 పైసలు, డీజిల్‌పై 20 పైసల వరకు వడ్డించాయి. పెరిగిన ధరలతో దేశ రాజధానిలో లీటర్ పెట్రోల్ ధర రూ.99.51, డీజిల్ రూ.89.36కు చేరాయి. దేశ ఆర్థిక రాజధాని ముంబై నగరంలో లీటర్ పెట్రోల్ రూ.105.98, డీజిల్ రూ.96.91కు పెరిగింది. మే 4వ తర్వాత నుంచి ఇప్పటి వరకు పెట్రోల్ ధరలను చమురు కంపెనీలు 35 సార్లు పైకి కదలగా.. ఇప్పటి వరకు మొత్తం రూ.9.19 వరకు పెరిగింది. డీజిల్ రేట్లు 34 సార్లు పెరగ్గా.. రూ.8.57 వరకు పెరుగుదల నమోదైంది.
ఇది కూడా చదవండి: ఒక్క డోసు తీసుకున్నా.. మరణాల నుంచి 92 శాతం రక్షణ