Tuesday, November 26, 2024

నాన్ స్టాప్ బాదుడు..మళ్లీ పెరిగిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు..

చమురు కంపెనీలు వాహనదారులకు షాక్‌ ఇస్తూనే ఉన్నాయి. ఈ నెలలో వరుసగా మూడో సారి పెట్రోల్‌, డీజిల్‌ ధరలను పెంచాయి. రోజు రోజుకు పెరుగుతున్న ఇంధన ధరలతో సామాన్యులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. తాజాగా పెట్రోల్‌పై లీటర్‌కు 28 పైసలు, డీజిల్‌పై 31 పైసలు పెంచాయి. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన అనంతరం ఇప్పటి వరకు 19 సార్లు ధరలు పెంచడంతో దేశవ్యాప్తంగా ఇంధన ధరలు ఆల్‌ టైమ్‌ గరిష్ఠ స్థాయికి చేరుకున్నాయి. ఇప్పటి వరకు పెట్రోల్‌పై రూ.4.71, డీజిల్‌పై రూ.5.28 వరకు చమురు కంపెనీలు పెంచాయి. కొత్తగా పెంచిన ధరలతో దేశ రాజధానిలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.95.03, డీజిల్‌ రూ.85.95కు చేరింది.

తాజాగా పెరిగిన ధరల వివరాలు ఇలా ఉన్నాయి. ఆర్థిక నగరం ముంబైలో లీటర్ పెట్రోల్‌ రూ.రూ.101.45, చైన్నైలో రూ.96.47, కోల్‌కతాలో రూ.95.02, బెంగళూరులో రూ.98.20, లక్నోలో రూ.92.29, పాట్నాలో రూ.రూ.97.18, చండీగఢ్‌లో రూ.91.40, హైదరాబాద్‌లో రూ.98.76కు చేరింది. మరో వైపు డీజిల్ ముంబైలో లీటర్‌ ధర రూ.85.95 పలుకుతుండగా.. చైన్నైలో రూ.90.66, కోల్‌కతాలో రూ.88.80, బెంగళూరులో రూ.91.12, పాట్నాలో రూ.91.24, లక్నోలో రూ.86.35, హైదరాబాద్‌లో రూ.93.70కి చేరింది. అత్యధికంగా రాజస్థాన్‌లోని శ్రీగంగానగర్‌లో లీట‌ర్‌ పెట్రోల్‌ ధర రూ.105.33కి చేరగా.. డీజిల్‌ ధర వందకు చేరువైంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement