Wednesday, November 20, 2024

తగ్గెది లే..మరోసారి పెరిగిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు..

రెండు రోజుల విరామం అనంతరం చమురు ధరలు మళ్లీ పెరిగాయి. ఇప్పటికే దేశవ్యాప్తంగా ఇంధన ధరలు ఆల్‌టైమ్‌ గరిష్ఠ స్థాయికి చేరుకున్నాయి. గత నెలలో 16 సార్లు పెరగ్గా.. జూన్‌లో రెండోసారి చమురు కంపెనీలు ధరలు పెంచాయి. తాజాగా లీటర్‌ పెట్రోల్‌పై 27 పైసలు, డీజిల్‌పై 30 పైసల వరకూ పెంచాయి. కొత్తగా పెంచిన ధరలతో దేశ రాజధాని ఢిల్లీలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.94.76, డీజిల్ లీటర్‌కు రూ.85.66కు పెరిగింది. ముంబైలో ముంబైలో పెట్రోల్‌ రూ.100.98, డీజిల్‌ రూ.92.99కు చేరింది. ఇప్పటికే రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌లోని చాలా చోట్ల పెట్రోల్‌ ధర రూ.104కు చేరింది. మే నుంచి ఇప్పటి వరకు 18 రోజుల్లో ధరలు పెరగ్గా.. పెట్రోల్‌పై రూ.4.36, డీజిల్‌పై రూ.4.93 పెరిగింది. హైదరాబాద్‌లో లీటర్‌ పెట్రోల్‌ ధర వందకు చేరువవుతుండగా.. ఆంధ్రప్రదేశ్‌లో దాదాపు అన్ని ముఖ్యనగరాల్లో లీటర్‌ పెట్రోల్‌ ధర వంద మార్క్‌ను దాటింది. మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌లోని దాదాపు అన్ని నగరాల్లోనూ దాదాపు రూ.105కు చేరువైంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement