పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరిగాయి. దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోల్ ధర లీటర్‌కు 29 పైసలు, డీజిల్‌పై 34 పైసలు పెంచాయి. తాజా పెంపుతో ఇంధన ధరలు రికార్డు స్థాయికి చేరాయి. ప్రస్తుతం ఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ.92.34, పెట్రోల్ రూ.82.95కు పెరిగాయి. ఆర్థిక రాజధాని ముంబైలో పెట్రోల్ రూ.93.36, డీజిల్, రూ.89.75, చెన్నైలో రూ.93.84, డీజిల్ రూ.87.49, కోల్‌కతాలో రూ.92.16, డీజిల్ రూ.85.45, హైదరాబాద్‌లో పెట్రోల్ రూ.95.97, డీజిల్ రూ.90.43, జైపూర్‌లో రూ.99.02, డీజిల్ రూ.91.80కి చేరాయి. ఇప్పటి వరకు ఈ నెలలో ఎనిమిది సార్లు పెట్రోల్ రేట్లు పెరిగాయి. పెట్రోల్‌పై రూ..1.94, డీజిల్‌పై రూ.2.22 పెరిగింది. దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు రికార్డు స్థాయికి చేరగా.. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లోని పలు చోట్ల లీటర్ పెట్రోల్ రూ.100 మార్క్‌ను దాటింది. రోజు రోజుకు ఇంధన ధరలు పైపైకి వెళ్తుండడంతో వాహనదారులు ఇబ్బందులకు గురవుతున్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement