Tuesday, November 26, 2024

‘పెట్రోల్,డీజిల్’ పై నితిన్ గ‌డ్క‌రీ కీల‌క వ్యాఖ్య‌లు..

రోజు రోజుకి పెట్రోల్, డీజిల్ ధ‌ర‌లు ఆకాశానంటుతున్నాయి. దాంతో వాహ‌న‌దారుల ఇక్క‌ట్లు అన్నీ ఇన్నీ కావు. ధ‌ర‌లు త‌గ్గించాల‌నే డిమాండ్ ఉంది. ఈ త‌రుణంలో కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. పెట్రోల్, డీజిల్ తో పాటు ఇతర పెట్రోలియం ఉత్పత్తులను జీఎస్‌టీ పరిధిలోకి తెస్తే వాటిపై పన్నులు తగ్గుతాయ‌న‌డం విశేషం. రాష్ట్ర ప్రభుత్వాలు మద్దతునిస్తే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ తప్పకుండా వీటిని జీఎస్‌టీలోకి చేర్చేందుకు ప్రయత్నించగలరని వెల్ల‌డించారు. జీఎస్‌టీ మండలిలో రాష్ట్రాల ఆర్థిక మంత్రులు కూడా సభ్యులుగా ఉన్నారు. కొన్ని రాష్ట్రాలు పెట్రోల్, డీజిల్‌ను జీఎస్‌టీ పరిధిలోకి తేవడాన్ని ఇష్టపడటం లేదు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. రియల్ టైమ్ న్యూస్ అప్ డేట్స్ కోసం.. ప్రభన్యూస్ ఫేస్‌బుక్‌, ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

https://twitter.com/AndhraPrabhaApp, https://www.facebook.com/andhraprabhanewsdaily

Advertisement

తాజా వార్తలు

Advertisement