నేటి వరకు బ్యూటీ ప్రొడక్ట్స్, దుస్తులు, ఫర్నిచర్, కూరగాయలతో సహా హోమ్ డెలివరి చేస్తున్నాయి పలు ఆన్ లైన్ యాప్ లు. కాగా ఇప్పుడు పెట్రోల్, డీజిల్ కూడా హోం డెలివరీ ఇవ్వనున్నారు. ఈ మేరకు విజయవాడలో ప్రయోగాత్మకంగా అమలు చేశారు. బీపీసీఎల్ అనే యాప్ ద్వారా పెట్రోల్, డీజిల్ ని ఆర్డర్ చేయాలి. ఈ యాప్ ద్వారా పెట్రోల్ , డీజిల్ ఆర్డర్ పెట్టిన వారికి ఇంటికే తెచ్చి ఇవ్వనున్నారు. కాగా డెలివరీ చేసే సమయంలో ప్రమాదం జరగకుండా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ప్రకారం ఫెసో క్యాన్ ను ఉపయోగించనున్నారు. ఇది ఇప్పుడు ప్రస్తుతం విజయవాడ నగరం పరిధిలో మాత్రమే అందుబాటులోకి వచ్చింది.
త్వరలోనే అన్ని మేజర్ సిటీస్‌లో దీనిని అమలు చేయనున్నారు. విజయవాడలోని గాంధీనగర్ పెట్రోల్ పంప్‌లో ఈ హోం డెలివరీ సిస్టమ్‌ను బీపీఎల్ సౌత్ డీజీఎం ప్రారంభించారు. ఇది ప్రస్తుతం విజయవాడ పట్టణవాసులకు అందుబాటులోకి వచ్చిందన్నారు. బీపీసీఎల్ యాప్‌ను డౌన్ లోడ్ చేసుకొని ఈ సౌకర్యం పొందవచ్చని సూచించారు. ఈ హోం డెలివరీ సిస్టమ్ తో పాటు ఫారెన్ లో అమలవుతున్న మరో సిస్టమ్ ను కూడా ప్రారంభించారు. పెట్రోల్ పంప్ ఉద్యోగులెవరీతో సంబంధం లేకుండా డెరెక్ట్ గా వినియోగదారుడే బంక్‌లో పెట్రోల్ కొట్టించుకోవచ్చు. యాపీఐ పేమెంట్స్ యాప్స్ ద్వారా అక్కడ ఉన్న స్కానర్ ను స్కాన్ చేసి డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. ఆర్టీఫిషియల్ ఇంటిలిజెన్స్ ద్వారా ఈ కొత్త సిస్టమ్ పని చేయనుంది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..