పెట్రోల్ ,డీజిల్ ధరల తగ్గింపుపై తెలంగాణ సర్కార్ అధ్యయనం చేస్తోంది. వెంటనే ధరలు తగ్గించే అవకాశం లేదని తెలంగాణ అధికారులు తెలిపారు. కేంద్రం ఎక్సైజ్ సుంకం తగ్గించడంతో రాష్ట్ర ఆదాయానికి గండిపడిందని అన్నారు. కేంద్ర నిర్ణయంతో ప్రతి నెల వందకోట్ల ఆదాయాన్ని ప్రభుత్వం కోల్పోనుంది. తెలంగాణలో పెట్రోల్ పై 35.2శాతం వ్యాట్, డీజిల్ పై 27శాతం వ్యాట్ విధించారు. ఈ మేరకు పెట్రోల్ ,డీజిల్ ధరలు ఎంతమేరకు తగ్గించవచ్చనే అంశంపై తెలంగాణ సర్కార్ అధ్యయనం చేస్తోంది.
Advertisement
తాజా వార్తలు
Advertisement