Wednesday, November 20, 2024

Market: పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌ల‌కు మ‌ళ్లీ రెక్క‌లు.. అక్టోబ‌ర్‌లో చ‌మురు ఉత్ప‌త్తి త‌గ్గించ‌నున్న కంపెనీలు

అక్టోబర్​లో చమురు ఉత్పత్తిని తగ్గించాలని ఒపెక్​ ప్ల‌స్‌ నిర్ణయించిన‌ట్టు తెలుస్తోంది. ఓపెక్ ప్ల‌స్ అనేది ప్ర‌పంచ వ్యాప్తంగా చ‌మురు ఉత్ప‌త్తి, స‌ప్ల‌య్ చేసే కంపెనీగా ఉంది. కాగా, ఏడాది కాలంలో ఇదే తొలిసారి అంటున్నారు మార్కెట్‌ ప‌రిశీల‌కులు. ఇక‌ అంతర్జాతీయంగా పతనమవుతున్న చమురు ధరల్లో స్థిరత్వాన్ని తీసుకొచ్చేందుకే అక్టోబర్​లో చమురు స‌ప్ల‌య్‌ని కూడా తగ్గించనున్నట్టు తెలుస్తోంది. ఒపెక్+​ సమావేశం సోమవారం జరిగింది.

ఈ నేపథ్యంలో అక్టోబర్​ నెలకు గాను.. చమురు ఉత్పత్తిని రోజుకు 1,00,000 బ్యారెళ్లకు తగ్గించాలని నిర్ణయించారు. ఇది అగస్టు లెవల్స్​కు సమానం. ఇటీవలి కాలంలో చమురు ధరల్లో తీవ్ర ఒడుదొడుకులు ఎదురయ్యాయి. చమురు మార్కెట్​లో లిక్విడిటీ తగ్గింది. అందువల్ల.. చమురు ధరల్లో స్థిరత్వాన్ని తీసుకొచ్చేందుకు సప్ల‌య్‌ని తగ్గిస్తున్నామని ఒపెక్​ వెల్లడించిది.

వచ్చే నెల 5వ తేదీన‌.. మరోమారు భేటీ కానున్న‌ట్టు ఓపెక్ ప్ల‌స్ తెలిపింది. అయితే.. అవసరమైతే ఈలోపు మళ్లీ సమావేశమవుతామని చెప్పింది. చమురు ఉత్పత్తి తగ్గితే.. సప్ల‌య్‌ పడిపోతుంది. సప్లై పడిపోతే.. డిమాండ్​ విపరీతంగా పెరుగుతుంది. దీని ఫలితంగా చమురు ధరలు మ‌ళ్లీ పెరుగుతాయి. ఇలా చమురు ధరలు పెరిగితే.. ద్రవ్యోల్బణం కూడా పెరిగే ప్రమాదం ఉందని మార్కెట్ నిపుణులు అంచ‌నా వేస్తున్నారు.

మరోవైపు.. చమురును దిగుమతి చేసుకుంటున్న మూడో అతిపెద్ద దేశంగా భారత్​ కొనసాగుతోంది. అంతర్జాతీయంగా చమురు ధరలు పెరిగితే.. ఆ భారం ఇండియాపైనే ఎక్కువ‌గా పడుతుంది. ఇదే కొనసాగితే.. దేశీయంగా పెట్రోల్​, డీజిల్​ ధరలు పెరిగినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదంటున్నారు ప‌రిశీల‌కులు.

- Advertisement -

పెరిగిన చమురు ధరలు..
ఒపెక్​ నిర్ణయంతో అంతర్జాతీయంగా చమురు ధరలు బ్యారెల్​కు 3డాలర్లు పెరిగాయి. ప్రస్తుతం.. నవంబర్​కు చెందిన బ్రెంట్​ క్రూడ్​ ఫ్యూచర్స్​.. 3.57డాలర్లు వృద్ధి చెంది.. 96.59 డాలర్ల వద్ద ఉంది. జూన్​ నెలలో 120 డాలర్ల మార్కును తాకిన బ్రెంట్ క్రూడ్​.. ఆ తర్వాత 95డాలర్లకు పడిపోయింది.​

Advertisement

తాజా వార్తలు

Advertisement