దేశంలో చమురు ధరలు పరుగు పెడుతున్నాయి. రోజురోజుకీ ధరలు మండిపోతున్నాయి. దీంతో సామాన్యుల జేబుకు చిల్లు పడుతోంది. తాజాగా బుధవారం పెట్రోల్‌పై 36 పైసలు, డీజిల్‌పై 38 పైసలు పెరిగింది. తాజా పెంపుతో హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 112.27, డీజిల్ రూ. 105.46గా చేరింది. విజయవాడలో లీటర్ పెట్రోల్ రూ. 114.04, డీజిల్ రూ. 106.26గా ఉంది. వరుసగా పెట్రోల్ ధరలు పెరుగుతుండటంతో మధ్య తరగతి ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలతో నిత్యావసరాల ధరలకు రెక్కలొచ్చాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: దళిత ద్రోహి కేసీఆర్.. దళిత ద్వేషి హరీష్: రాములమ్మ