Saturday, November 23, 2024

Flash: వాహనదారులకు బిగ్ షాక్.. పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు

వాహ‌నదారుల‌కు చ‌మురు సంస్థ‌లు భారీ షాక్ ఇచ్చాయి.  పెట్రోల్, డీజిల్ ధ‌ర‌ల‌ను పెంచుతూ నిర్ణ‌యం తీసుకున్నాయి. దేశవ్యాప్తంగా లీట‌ర్ పెట్రోల్ పై 91 పైస‌లు, డీజిల్ పై 88 పైస‌లు పెంచాయి.  పెరిగిన ధ‌ర‌ల‌తో హైద‌రాబాద్ న‌గ‌రంలో లీట‌ర్ పెట్రోల్ ధ‌ర రూ. 109.10 కు, డీజిల్ ధ‌ర రూ. 95.49 కు చేరింది. ఢిల్లీలో పెట్రోలు ధర గతంలో రూ. 95.41గా ఉండగా ఇప్పుడు రూ. 96.21కి చేరింది. ఇక డీజిల్ ధరలు లీటరుకు రూ.86.67 నుంచి రూ.87.47కి పెరిగింది.

కాగ పెట్రోల్, డీజీల్ ఐదు నెల‌ల త‌ర్వాత‌ ఈ రోజు పెరిగాయి. గతేడాది నవంబర్ 4 నుండి ధరలు పెరగలేదు. ఉక్రెయిన్ – ర‌ష్యా యుద్ధం వ‌ల్ల అంత‌ర్జాతీయంగా క్రూయిడ్ ఆయిల్ ధ‌ర‌లు భారీగా పెరిగాయ‌ని చ‌మురు సంస్థ‌లు తెలిపాయి. దీంతో భారీ స్థాయిలో న‌ష్ట పోతున్నాయని అందు కోసమే ఈ నిర్ణ‌యం తీసుకోవాల్సి వ‌చ్చింద‌ని పేర్కొన్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement