దేశంలో చమరు ధరలు మండిపోతున్నాయి. ప్రతిరోజూ పెట్రో ధరలు పెంచుతూ సామాన్యుడి నడ్డి విరుస్తున్న చమురు మార్కెటింగ్ కంపెనీలు.. వరుసగా నాలుగోరోజూ పెట్రోల్, డీజిల్ ధరలు పెంచాయి. లీటరు పెట్రోలుపై 30 పైసలు, డీజిల్‌పై 35 పైసల చొప్పున పెరిగింది. దీంతో ఢిల్లీలో లీటరు పెట్రోల్ ధర రూ.103.54కు చేరగా, డీజిల్ ధర 92.17కు పెరిగింది. ఇక ముంబైలో పెట్రోల్ రూ.109.54, డీజిల్ రూ.99.22, చెన్నైలో పెట్రోల్ 101.01, డీజిల్ 96.60, కోల్‌కతాలో పెట్రోల్ రూ.104.23, డీజిల్ రూ.95.23కు చేరాయి. హైదరాబాద్‌లో పెట్రోలుపై 31 పైసలు, డీజిల్‌పై 38 పైసల చొప్పున పెరిగాయి. దీంతో లీటరు పెట్రోలు రూ.107.73కు చేరగా.. లీటరు డీజిల్ రూ.100.51కి పెరిగింది.
ఇది కూడా చదవండి: కొత్త కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ.. మాజీ మంత్రి ఈటలకు కీలక పదవి