దేశంలో పెట్రో బాదుడు కొనసాగుతోంది. గత కొద్ది రోజులుగా నాన్ స్టాప్ గా పెట్రోల్, డీజిల్ ధరలు పెగుతుండగా..తాజాగా మరోసారి పెంచుతున్నట్లు చమురు సంస్థలు ప్రకటించాయి. గురువారం పెట్రోల్, డీజిల్పై లీటర్కు 35 పైసలు పెంచాయి. తాజా పెంపుతో దేశ రాజదాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.108.29కు చేరగా.. డీజిల్ ధర రూ.97.09కు చేరింది. హైదరాబాద్లో లీటర్ పెట్రోల్ ధర రూ.112.59కు చేరుకుంది. డీజిల్ ధర లీటర్కు రూ.105.80కి ఎగసింది. కాగా, వరుసగా పెట్రోల్ ధరలు పెరుగుతుండటంతో మధ్య తరగతి ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: పారిస్ తో కేటీఆర్ బిజీబిజీ.. తొలిరోజు నుంచే ప్రముఖులతో భేటీలు