ఒకరోజు విరామం తర్వాత దేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరిగాయి. శుక్రవారం వీటి ధరలు పెరగా.. శనివారం మాత్రం పెరగలేదు. కానీ ఆదివారం మళ్లీ ధరలు పెరిగాయి. తాజాగా లీటర్ పెట్రోల్‌పై 24 పైసలు, లీటర్ డీజిల్‌పై 30 పైసలు పెంచుతూ ఆయిల్ కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. దీంతో దేశ రాజధానిలో లీటర్ పెట్రోల్ ధర రూ.92.58, డీజిల్ రూ.రూ.83.22కు పెరిగింది. ఆర్థిక రాజధాని ముంబైలో పెట్రోల్ రూ.98.88, డీజిల్ రూ.90.04, చెన్నైలో పెట్రోల్ రూ.94.34, డీజిల్ రూ.88.07, కోల్‌కతాలో పెట్రోల్ రూ.92.67, డీజిల్ రూ.86.06, హైదరాబాద్‌లో పెట్రోల్ రూ.96.21, డీజిల్ రూ.90.73కి చేరాయి.
ఇప్పటి వరకు ఈ నెలలో తొమ్మిది సార్లు పెట్రోల్, డీజిల్ రేట్లు పెరిగాయి. తాజా పెరుగుదలతో దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు రికార్డు స్థాయికి చేరాయి. రాజస్థాన్‌లోని శ్రీగంగానగర్‌లో పెట్రోల్ రూ.103.52, డీజిల్ రూ.95.99కి చేరింది. మధ్యప్రదేశ్‌లోని అనొపురలో పెట్రోల్ రూ.103.21, రెవాలో రూ.102.85, ఇండోర్, భోపాల్‌లో రూ.100 వంద దాటింది.