తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల పెంపు విషయం ఇప్పుడు సుప్రీం కోర్టుకు వెళ్లింది. ఈ మేరకు పర్యావరణ వేత్త కె. పురుషోత్తమరెడ్డి రిట్ పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్‌ని ధర్మాసనం విచారణకు స్వీకరించింది. దీంతో తెలంగాణలో ఉన్న 119 అసెంబ్లీ సీట్లను 153కు, ఆంధ్రప్రదేశ్‌లోని 175 స్థానాలను 225కు పెంచేలా అవకాశం కల్పించాలని సుప్రీంను కోరారు. అంతేకాకుండా విభజన చట్టం ప్రకారం నిబంధనలు అమలు చేసేలా కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని సుప్రీం కోర్టును కోరారు. దాంతోపాటు కేంద్ర ప్రభుత్వం, తెలంగాణ, ఏపీ, ఎన్నికల కమిషన్‌ను ప్రతివాదులు చేర్చారు. ఈ క్రమంలో సుప్రీం కోర్టు ఆయా ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది.
Breaking: అసెంబ్లీ సీట్ల పెంపుపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు.. నోటీసులు జారీచేసిన ధర్మాసనం
Advertisement
తాజా వార్తలు
Advertisement