ఇజ్రాయెల్ స్పైవేర్ పెగాసస్‌ను ఉపయోగించారని, వ్యక్తి స్వేచ్ఛకు భంగం కలిగించారన్న ఆరోపణలపై సుప్రీంకోర్టులో ఇవ్వాల మరో పిటిషన్ దాఖలు అయ్యింది. న్యాయవాది ఎంఎల్ శర్మ పెగాసస్ సమస్యపై సుప్రీంకోర్టును ఆశ్రయించారు. లావాదేవీకి సంబంధించి సంబంధిత వ్యక్తులపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించాలని డిమాండ్ చేశారు. దీనిపై న్యూయార్క్ టైమ్స్ నివేదికను కోర్టు పరిగణలోకి తీసుకోవాలని, ఇజ్రాయెల్‌తో 2017 రక్షణ ఒప్పందంపై విచారణకు ఆదేశించాలని పిటిసన్‌లో కోరారు. క్షిపణి వ్యవస్థలతో సహా ఆయుధాల కోసం 2 బిలియన్ డాలర్ల ప్యాకేజీలో భాగంగా భారత ప్రభుత్వం 2017లో పెగాసస్‌ను కొనుగోలు చేసిందని న్యూయార్క్ టైమ్స్ నివేదికను దరఖాస్తులో పేర్కొన్నారు.
NYT, ‘ది బ్యాటిల్ ఫర్ ది వరల్డ్స్ మోస్ట్ పవర్‌ఫుల్ సైబర్‌వీపన్’ పేరుతో వెలువరించిన నివేదికను ఉదహరిస్తూ ఈ పిటిషన్ దాఖలు చేశారు. కాగా, ఇజ్రాయెలీ సంస్థ NSO గ్రూప్ దాదాపు పదేండ్ల పాటు తన నిఘా సాఫ్ట్ వేర్‌ను ప్రపంచవ్యాప్తంగా గూఢచార సంస్థలకు విక్రయిస్తోందని, ఇది ఏ నిఘా సంస్థలలు చేయలేని విధంగా దేశపౌరుల చాట్లపై, పోన్ కాల్స్‌పై నిఘా పెట్టడానికేనని పేర్కొన్నారు. అంతేకాకుండా ఇంటెలిజెన్స్ సర్వీస్ కూడా ట్రాక్ చేయని విధంగా-ఒక ఐఫోన్ లేదా ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ యొక్క ఎన్‌క్రిప్టెడ్ కమ్యూనికేషన్‌లను కూడా ట్రాక్ చేస్తున్నారని.. దానికి ఆ విశ్వసనీయంగా క్రాక్ చేయగలమని వారికి వాగ్దానం చేసినట్టు ఆధారాలున్నాయని కోర్టుకు వెల్లడించారు.